Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నిఖిల్ మూవీ నుంచి ఆసక్తిని రేకెత్తించే ప్రీ లుక్

  • సంతోష్ దర్శకత్వంలో నిఖిల్ తాజా చిత్రం 
  • కథానాయికగా లావణ్య త్రిపాఠి 
  • రేపు ఉదయం ఫస్టులుక్ రిలీజ్    
'ఎక్కడికి పోతావు చిన్నవాడా' .. 'కేశవ' .. 'కిరాక్ పార్టీ' సినిమాలతో నిఖిల్ వరుస సక్సెస్ లను అందుకున్నాడు. తన సినిమా రిలీజ్ అవుతుందంటే యూత్ అంతా ఎదురుచూసేలా చేశాడు. ఆయన తాజా చిత్రం టి.ఎన్. సంతోష్ దర్శకత్వంలో రూపొందుతోంది. 2016లో తమిళంలో వచ్చిన 'కణితన్' ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ మూవీకి రీమేక్ గా .. అదే దర్శకుడితో ఈ సినిమా రూపొందుతోంది.లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. 'గన్' కంటే 'పెన్' చాలా పవర్ఫుల్ అనే కాన్సెప్ట్ తో నిర్మితమవుతోన్న ఈ సినిమాలో, నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నాడు. రేపు నిఖిల్ పుట్టినరోజు కావడంతో, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ప్రీ లుక్ ను రిలీజ్ చేశారు. రేపు ఉదయం ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో నిఖిల్ ఖాతాలో మరో హిట్ చేరుతుందేమో చూడాలి.       
nikhil
lavanya tripathi

More Telugu News